Magazines

ఇసుక టిప్పర్ పట్టివేత..

1 గంట క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్ 

మండలంలోని మున్నూరు గ్రామ శివారులో మంగళవారం రాత్రి మిడ్జిల్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ అక్రమ ఇసుక రవాణా ఉదంతం వెలుగుచూసింది. చీకటి పడిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మున్ననూర్ గ్రామ శివారులోని నుండి ఇసుకను తరలించేందుకు జెసిపితో ఇసుక టిప్పర్లో లోడు చేస్తుండగా.. నిఘా ఉంచిన మిడ్జిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి చేసి, జేసీబీతో టిప్పర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాత్రి పూట గ్రామీణ ప్రాంతాల్లో ఇసుక మాఫియా సాగిస్తున్న ఇటువంటి అక్రమ తవ్వకాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.  ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామా తెలిపారు. టిప్పర్, జెసిపి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు .

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్