నవతెలంగాణ-పుల్కల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మైసా షూటింగ్ సింగూరు ప్రాజెక్టు ముందున్న వంతెనపై ఆదివారం ఉదయం నుంచి జరుగుతోంది. షూటింగ్ విషయం తెలుసుకున్న స్థానికులు, రష్మిక అభిమానులు భారీగా స్పాట్లోకి చేరుకున్నారు. ఒ వైపు షూటింగ్.. మరోవైపు నటులను చూడాలనే తాపత్రయంతో కొందరు రోడ్డుమీదే వాహనాలను నిలపడంతో పాటు చిత్ర నిర్మాతలు కూడా ట్రాఫిక్ ను పట్టించుకోకుండా షూటింగ్ జరపడంతో వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర వాహనం అంబులెన్స్ హారన్ కొట్టినా చిత్ర యూనిట్ పట్టించుకోకపోవడం గమనార్హం. అంతేకాదు.. ఈ షూటింగ్ కు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇంత నిర్లక్ష్యంగా సినిమా నిర్మాతలు వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగూర్ నుంచి సదాశివపేట వెళ్ళేందుకు ఇదే ఏకైక మార్గం. ఈ వంతెన పైనుండి నిత్యం వేలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సింగూరు కాలువను దాటేందుకు కూడా ఇదొక్క మార్గమే ఉంది. షూటింగ్ వల్ల వంతెనకు అటూ ఇటూగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా.. పోలీసులు సైతం ట్రాఫిక్ నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు.






కామెంట్లు (0)