నవతెలంగాణ-హైదరాబాద్: పుణె నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానాన్ని శంషాబాద్లో ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో ఇండిగో 6ఇ352 విమానం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే.. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సూచనతో విమానాన్ని నిపుణుల బృందం తనిఖీ చేసింది. విమానం చండీగఢ్ వెళ్లాల్సి ఉండగా అధికారులు.. ఆ సర్వీసును రద్దు చేశారు.
శంషాబాద్లో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)