– సర్పంచ్ జనగాం సుధారాణి
నవతెలంగాణ–ఆలేరు రూరల్
ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సర్పంచ్ జనగాం సుధారాణి తెలిపారు.శనివారం ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో మేడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చన్నారు. గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణిభాస్కర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారునంది భాస్కర్,మాజీ మండలాధ్యక్షులు కొండ్ర జు వెంకటేశ్వరరాజు, ఉపసర్పంచ్ గాజుల దశరథ,వార్డ్ మెంబర్లు మస్తాన్,బిక్షపతి,అరుణ,అంజయ్య,బాకీ పద్మ, సావిత్రి,సురేష్,పర్విన్,రాజు,వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్,మండల అధ్యక్షులు దీప,గ్రామ శాఖ అధ్యక్షులు ఆంజనేయులు,గ్రామ కార్యదర్శి శశికాంత్ గౌడ్, వైద్య బృందం పవన్, కుమార్,డాక్టర్ మాధవి, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)