Magazines

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి: సీపీఐ

19 సెప్టెంబర్, 2026

Indiramma houses
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరుటౌన్ 
అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఆలేరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం మండల కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్క వెంకటేష్ హాజరై మాట్లాడుతూ.. కొలనుపాకలో సర్వే నెంబర్ 8లో గల ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు గుడిసెలు వేసుకుని రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రభుత్వం  పెడచెవిన పెడుతోందనీ, వెంటనే అర్హులను గుర్తించి వారికి ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చౌడపల్లి కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు చౌడబోయిన పరశురాములు, గిరిపోయిన స్వామి,కందుల మధు, మండల నాయకులు అయిలీ రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్