నవతెలంగాణ-ఆలేరు టౌన్
చేనేత సహకార సంఘానికి, మాజీ అధ్యక్షులు, స్వర్గీయ చింతకింది వెంకటేశ్వర్లు చేసిన సేవలు ప్రశంసనీయమని, హ్యాండ్లూమ్ కో-ఆపరేటివ్ సొసైటీ, చైర్మన్ దాసి శంకర్ అన్నారు. ఆలేర్ పట్టణంలో మంగళవారం చేనేత కార్మిక సంఘం భవనం ఆవరణలో
చేనేత సహకార సంఘం మాజీ చైర్మన్ చింతకింది వెంకటేశ్వర్లు 6వ వర్ధంతి పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా మౌనం పాటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. చేనేత రంగానికి, సహకార సంఘానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ముఖ్య అతిధిగా యాదాద్రి భువనగిరి జౌలీశాఖ ఏడిఓ సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సమావేశంలో ఆలేరు మున్సిపల్ కో ఆప్షన్ మెంబెర్ చింతకింది మురళి చేనేత వైస్ చైర్మన్ చింతకింది రంగా, కార్యదర్శి గాడిపెల్లి రమేష్, కోశాధికారి ఎలగందుల ఉమారుషి, సహాయ కార్యదర్శి బింగి నర్సింహులు, డైరెక్టర్స్ అంకం మల్లేశం, అందె రాములు, ఎలగందుల పద్మ, బేతి భాగ్య, మాజీ కార్యదర్శి ఎలగందుల రామారుషి, మాజీ ఉపాధ్యక్షులు సామల రామనర్సయ్య, పద్మశాలి మండల అధ్యక్షులు సామల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కర్రె ఎల్లయ్య,పద్మసుదర్శన్, చింతకింది రామానుజం తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)