నవతెలంగాణ-మద్నూర్
పేద ప్రజల అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చికిత్సకై ప్రభుత్వం బాధితులకు సీఎంఆర్ఎఫ్ నిధులు అందించి కొండంత అండగా నిలుస్తోందని సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రీ అన్నారు. శనివారం బాధితులకు విడుదలైన చెక్కులను వారు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సీఎంఆర్‌ఎఫ్ నిధుల మంజూరుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావు ప్రత్యేక కృషి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, సంతోష్ మేస్త్రి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు (0)