విండో చైర్మన్ రామ్ పటేల్, కార్యదర్శి బాబురావు
నవతెలంగాణ-మద్నూర్
రైతులు తమ పంటను దళారులకు అమ్ముకొని మోస పోవద్దనీ, సర్కార్ మద్దతు ధరకు అమ్ముకొని క్వింటాలకు రూ.500 బోనస్ పొందాలని డోంగ్లి సింగిల్ విండో చైర్మన్ రామ్ పటేల్, కార్యదర్శి బాబురావులు అన్నారు. డోంగ్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో మదన్ హిప్పరుగా, సిర్పూర్, గ్రామాల్లో వరి ధాన్యం మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భందా వారు మాట్లాడుతూ..వరి ధాన్యానికి సర్కార్ మద్దతు ధర రూ.2,461 ప్రకటించిందని, క్వింటాలుకు రూ.500 బోనస్ లభిస్తుందని వారు తెలిపారు. ఈ మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్, ఆ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మాధన్ హిప్పర్గా సర్పంచ్ బాచవార్ లక్ష్మణ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ అశోక్ పటేల్, మాజీ సర్పంచ్ విట్టల్ రావు, సింగిల్ విండో సిబ్బంది వరి ధాన్యం రైతులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)