Magazines

బియ్యం సరే...నిత్యావసరాలేవి.?

1 గంట క్రితం

Sarukulu
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

మండుతున్న ధరలు..

నవతెలంగాణ - మల్హర్ రావు 

మనం ఎప్పుడూ బియ్యం తినాల్సిందేనా.? ఉల్లి గడ్డ,నూనె, కందిపప్పు,పంచదార ఇవ్వరా అంటూ రేషన్ కార్డులున్న పేద,మధ్య తరగతి కుటుంబాలు పౌర సరఫరాల శాఖను ప్రశ్నిస్తున్నాయి.దసరా పండగ వేళ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పౌర సరఫరాలశాఖ ద్వారా చౌకధర దుకా ణాల్లో ఉచిత బియ్యంతో పాటు రాయితీ ధరలకు ఉల్లిగడ్డ,పామాయిల్,కందిపప్పు,పంచదార సరఫరా చేస్తోంది. తెలంగాణలో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండుతున్న ధరలు..

మండుతున్న నిత్యావసరాల ధరలతో ప్రజలు నలిగిపోతున్నారు. రూ.500 తీసుకెళ్తే సంచికి కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు.కిలో రూ.15-30 ఉండాల్సిన ఉల్లి ధర రూ.70కి చేరింది.కందిపప్పు ధర రూ.50-80 నుంచి అమాంతం రూ.130కి ఎగబాకింది.పంచదార రూ.60,పామాయిల్ రూ.150, పల్లీ, సన్ఫ్లవర్ నూనె రూ.180 ఉంది.ఈ పరిస్థితుల్లో చౌక దుకాణాల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసరాలు పంపిణీ చేయకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


పదేళ్ల బిఆర్ఎస్ హయాంలోనూ బియ్యం మినహా నిత్యావసరాలు వినియోగదారులకు పంపిణీ చేయలేదు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలొనూ అదే పరిస్థితి.ఆంధ్రప్రదేశ్లో అప్పుడు,ఇప్పుడూ బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. రాయితీపై సరకులు అందజేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024 ఏప్రిల్ లో ఏఏవై (అంత్యోదయ అన్న యోజన) కార్డులు కలిగిన వారికి చక్కెర పంపిణీ చేయాలని నాటి పౌరసరఫరాల శాఖ కమిషనర్ ను ఆదేశించినా అమలు కాలేదు.డీలర్లను ఆరా తీస్తే డీడీలే తీయలేదని చెప్పడం గమనార్హం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్