ట్రాక్టర్ జనరేటర్ వరి పంటకు నీరు
కరెంట్ కోతతో రైతులకు కష్టాలు
నవతెలంగాణ-మల్హర్ రావు
విద్యుత్ కోతలతో పొట్టకొచ్చిన వరి పంట ఎండుతుండటంతో రక్షించుకోవడానికి రైతులు నానాపాట్లు పడుతున్నారు. మండలంలోని తాడిచెర్ల, వల్లెంకుంట, మల్లారం తదితర మానేరు పరివాహక ప్రాంతాల్లో ట్రాక్టర్ జనరేటర్ సాయంతో వరి పొలానికి నీరు పారిస్తున్నారు. గతంలో రైతులు పంటలకి సాగులో ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం పంటలకు నీరు అందక జనరేటర్ సాయం పొందుతున్నారు.
కనీసం రోజుకు 9 గంటల కరెంట్ రావడం లేదని, ఇప్పటికే ఎండలు మండుతుండటంతో పంటలకు నిరంతరం నీరు అవసరమైన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇచ్చే కరెంట్ కూడా తరచూ వచ్చి పోవడంతో, లో ఓల్టేజితో బోర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. జనరేటర్ తో ఒకఫూట నీరు పారించి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అయినా కరెంట్ సరిపడరావడం లేదని వాపోయారు.ఇ రవై ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, మళ్లీ ఇప్పుడు కరువు కళ్లముందు కనబడుతోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని, లో ఓల్టేజీ సమస్యను తీర్చాలని రైతులు వాపోతున్నారు.





కామెంట్‌లు (0)