సిడాం గణేష్‌కు మండల ఎస్టీ సెల్ అధ్యక్ష బాధ్యతలు
నవతెలంగాణ–నేరడిగొండ
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం సిరికొండ మండలం రాంజీగూడ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అలాగే సిరికొండ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా సిడాం గణేష్‌ను నియమించారు. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.తనకు బాధ్యతలు అప్పగించినందుకు సిడాం గణేష్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సతీష్,సనా హుళ్ల సీతారాం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)