Magazines

భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

3 రోజుల క్రితం

land re-survey
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నిర్మల్  జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నవతెలంగాణ -ముధోల్ 

భూముల రీ సర్వే ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని  నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.మంగళవారం తానూరులో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులను సర్వే పురోగతి, చేపడుతున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.రీసర్వే నిర్వహించే ముందు సంబంధిత రైతులందరికీ ముందస్తుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.


రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహిస్తూ, ఎలాంటి వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సర్వే బృందంలోని సిబ్బంది అందరూ విధిగా పాల్గొని, నిర్దేశించిన గడువులోగా రీ సర్వేను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.అనంతరం రైతులతో మాట్లాడిన కలెక్టర్, భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. సర్వే సమయంలో సంబంధిత భూముల రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. రీ సర్వే ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా పూర్తయ్యేందుకు రైతులు అధికారులకు సహకరించాలని కోరారుఈ పరిశీలనలో తహసీల్దార్ మహేంద్రనాథ్, సర్వేయర్ కిషన్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ,పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్