Magazines

అంధకారంలో ఆలేరు బస్టాండ్ 

1 గంట క్రితం

Aaleru Bus Stand
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌను  

ఆలేరు బస్టాండ్‌ అంధకారంలో మునిగిపోయింది. పట్టణాలు, వివిధ ప్రాంతాల నుంచి తమ సొంతూరుకు వచ్చే ప్రయాణికులకు ఆలేరు బస్టాండ్‌ చిమచీకట్లతో స్వాగతం పలుకుతోంది. సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలను ఎంతో ఆనందంగా ఊర్లో గడిపేందుకు వచ్చిన ప్రయాణికుల ఆశలు బస్టాండ్‌లోనే ఉసూరుమనిపించేలా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష‍్యం స్పష్టంగా కనిపిస్తోంది. సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆలేరు బస్టాండ్‌లో దిగిన ప్రయాణికులు బస్సు దిగగానే తమ సెల్‌ఫోన్‌ టార్చ్‌లైట్‌ వెలుగులో బయటికి రావాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. మరోవైపు పగటి పూట బస్టాండ్‌కు వెళ్లినా ఫ్యాన్‌లు లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలే పండగల వాతావరణం, అదీగాక మధ్యాహ్నం ఎండలు మండుతున్నాయి. అయినా ఇవేవీ ఆర్టీసీ అధికారులకు కనిపించినట్టు లేదని ప్రయాణికులు వాపోతున్నారు. పండగల రద్దీని దృష్టిలో ఉంచుకుని వెంటనే అధికారులు స్పందించి బస్టాండ్‌లో విద్యుదీపాలు, ఫ్యాన్‌లతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్