Magazines

ధర్బా తండా ఆలయంలో ఆభరణాల చోరీ

59 నిమిషాల క్రితం

Dharba Thanda temple
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం


క్లూస్‌ టీమ్‌తో ఆధారాల సేకరణ..దర్యాప్తు ముమ్మరం


నవతెలంగాణ–నేరడిగొండ:

నేరడిగొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ధర్బా తండా సమీపంలో ఉన్న ఆలయంలో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్‌ఐ ఇమ్రాన్‌ ఖాన్‌ తెలిపారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక పరిశీలన చేపట్టారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలో ఆధారాలు చెదిరిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.క్లూస్‌ టీమ్‌ సహకారంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించినట్లు పేర్కొన్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి, లభించిన ఆధారాల ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఆలయంలో చోరీ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాల పూర్తి వివరాలు, వాటి విలువ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్