నవతెలంగాణ - ముధోల్
ముధోల్ మండలంలోని చించాల గ్రామానికి చెందిన యువకులు, పిల్లలు దసరా నవరాత్రుల సందర్భంగా చించాల నుండి బాసర వరకు శుక్రవారం పాదయాత్ర చేశారు. ముందుగా యువకులు, పిల్లలు, గ్రామంలో ఉన్న భజరంగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గ మాత మండపం నుండి దర్శించుకున్న అనంతరం బాసరకు కాలినడకన బయలుదేరి వెళ్లారు. బాసర చేరుకున్న పాదయాత్ర బృందం సభ్యులు బాసర గోదావరిలో స్నానమాచరించిన అనంతరం, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకున్నారు.
పాదయాత్రగా బాసరకు బయలుదేరిన యువకులు
7 గంటల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)