Magazines

అశ్వారావుపేటను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

1 గంట క్రితం

drought area
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

- సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు గోకినపల్లి ప్రభాకర్ డిమాండ్

- తాశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.. వినతిపత్రం అందజేత

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు.


మండలంలో సగానికి పైగా భూములు సాగుకు నోచుకోలేదని, సాగు చేసిన పంటలు నీటి కొరతతో ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, దళారీ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. అప్రకటిత విద్యుత్ కోతలను అరికట్టడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, కావడిగుండ్ల సర్పంచ్ బాడిస లక్ష్మణరావు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్