నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన చైర్మన్గా పట్టణానికి చెందిన చల్లగుళ్ల నరసింహారావును ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఈ నెల 16వ తేదీన ఆయన పదవీ స్వీకారం చేయనున్న సందర్భంగా పలువురు నాయకులు, అధికారులు నరసింహారావును కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. తాజా మాజీ ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు నరసింహారావును కలుసుకొని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. బుగ్గపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నరసింహారావును ఘనంగా సన్మానం చేశారు. రామానగరంలో మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శివా సత్యనారాయణమూర్తి (వేణు) ఆధ్వర్యంలో అభినందిస్తూ సన్మానించారు.
మదర్ థెరెసా విద్యా సంస్థల అధినేత చలసాని ఆధ్వర్యంలో
మదర్ థెరెసా విద్యా సంస్థల అధినేత చలసాని సాంబశివరావు ఆధ్వర్యంలో నరసింహారావును నరసింహారావును కలుసుకొని శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆయిల్ పామ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, దమ్మపేట మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైడి వెంకటేశ్వరరావు చల్లగుళ్లకు అభినందనలు తెలిపారు.
సత్తుపల్లి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో
సత్తుపల్లి వ్యవసాయ శాఖ అధికారులు నూతన ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావును మర్యాదపూర్వకంగా కలుసుకొని సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏడీఏ వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి , సత్తుపల్లి, వేంసూరు వ్యవసాయ శాఖ మండల అధికారులు యరపతినేని శ్రీనివాసరావు, రామ్మోహనరావు పాల్గొన్నారు. వివిధ రంగాల ప్రముఖులు, రైతు నాయకులు చల్లగుళ్ల నరసింహారావుకు తమ అభినందనలు తెలిపారు. నరసింహారావు నాయకత్వంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.






కామెంట్లు (0)