నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏఐకేఎస్ జాతీయ మహాసభలను పురస్కరించుకొని ఈ నెల 15న నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. మహాసభల విజయవంతం కోసం మంగళవారం మండలంలోని నందిపాడులో కారం సూరిబాబు అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన నల్లగొండలో జరుగుతున్న మహాసభల్లో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి, మండల కార్యదర్శి సోడెం ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాడి నాగేశ్వరరావు, మడకం నాగేశ్వరరావు, కారం వీరాస్వామి, ఎట్టి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)