నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పాత తరం వృద్ధులు నడిపల్లి జనార్దనరావు ఆదివారం శివైక్యం చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ విజయకుమార్ సోమవారం వారి నివాసానికి వెళ్లారు. జనార్దనరావు చిత్రపటానికి పూలుజల్లి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జనార్ధనరావు పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావుతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)