Magazines

కెడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్ధిక, అక్షరాస్యతపై అవగాన

58 నిమిషాల క్రితం

KDCC Bank
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాడిచర్ల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మల్లంపల్లి గ్రామం లో ఆర్థిక అక్షరాస్యత,నగదు రహిత లావాదేవీల పైన మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ దుమ్మని లక్ష్మణ్ హాజరై మాట్లాడారు. బ్యాంకు ద్వార సేవింగ్ ఖాతాలు ఓపెన్ చేసి పొదుపు అలవాటు చేసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలన్నారు. అన్ని బ్యాంకులో కెల్లా కెడిసిసి బ్యాంకు లో అధిక శాతం వడ్డీ, డిపాజిట్ పైన ఇవ్వటం జరుగుతుందన్నారు.


తమ బ్యాంకులో క్రాప్ లోన్స్, వ్యవసాయ, మ్యారేజి, ఇంటి నిర్మాణ, ఎడ్యుకేషన్ లోన్స్, బంగారు ఆభరణాల మీద రుణాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. అప్పులు తీసుకొని తిరిగి సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ బాగున్నట్లయితే భవిష్యత్తులో రుణాలు తీసుకోవటానికి, మంజూరుకు ఇబ్బంది ఉండదని, బ్యాంకు ద్వార ప్రధాన మంత్రి సురక్ష బీమా పథకం, జీవన జ్యోతి పథకం వంటి ఇన్సూరెన్స్ పథకాలు అతి తక్కువ ప్రీమియం తో చెల్లిస్తే రూ.4 లక్షల వరకు భీమా సౌకర్యం బ్యాంకుల ద్వారా కల్పించటం జరుగుతుందన్నారు.


అపరిచిత వ్యక్తులకు ఓటిపి వంటి విషయాలు తెలుపకుండా జాగ్రత్తగా ఉండాలని, లాకర్ సదుపాయం కూడా బ్యాంకులో కల్పించటం జరుగుతుందన్నారు. అన్ని సదుపాయాలు వినియోగించుకొని ఆర్థికంగా బలుపేతం అవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాడి రాములు, సిఏప్ఏల్ శ్రీనివాస్, పంచాయతీ  కార్యదర్శి శివ ప్రసాద్, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ సదయ్య, బ్యాంక్ సిబ్బంది, సంఘ సిబ్బంది, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్