- హీరో శర్వా
హీరో శర్వా ‘భోగి’ తో రగ్గడ్, ఇంటెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు.
లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఈనెల 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ,‘ప్రతి సినిమాకీ ఒక టెన్షన్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాకి నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఫస్ట్ కాపీ చూసినప్పుడే ఒక తెలియని సంతృప్తిని ఇచ్చాడు మా సంపత్ నంది. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా ఒక కథను నమ్మి, శర్వా ఒక నటుడిగా ఈ పాత్ర చేయగలడని బలంగా నమ్మారు మా నిర్మాత. అంత మంచి కథ చేసినందుకు రాధా మోహన్‌కి థాంక్యూ. భీమ్స్‌తో మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన క్రియేట్ చేసిన పాటలు మామూలుగా ఉండవు. చచ్చిపోయే వరకు గుర్తుండిపోయే పాటలు ఇవి. అంత అద్భుతంగా మ్యూజిక్ చేశారు. అలాగే ఈ సినిమాకి మరో ప్రధాన బలం మా చంద్రబోస్. ఒక్కొక్క పదం అద్భుతంగా రాశారు. పాటలకు ప్రతిరోజూ లక్షల వ్యూస్ పెరుగు తున్నాయి. ఇది డబ్బు పెట్టి, పుష్ చేసి చేసిన సినిమా కాదు. సినిమా మీద నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను. అనుపమ, డింపుల్‌తో పాటు నా చెల్లెలి పాత్ర చేసిన అమ్మాయి.. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఇమేజ్ను పక్కనపెట్టి, కథను నమ్మి చేసిన సినిమా ఇది. సంపత్ నందికి మాస్ మీటర్ బాగా తెలుసు. ఇందులో అందరి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.
ఈ సినిమాతో సంపత్ నంది నాలో కొత్త యాంగిల్‌ను ఇండస్ట్రీకి చూపించారు’ అని తెలిపారు. ‘ఇది సంక్రాంతికి ముందు వచ్చే భోగి కాదు. చెడును చంపిన తర్వాత వచ్చే భోగి. బొగ్గులకుంట అనే గ్రామంలో చాలా కాలంగా ఉన్న బానిసత్వాన్ని, కొన్ని నమ్మకాలను మంటలో వేసి కొత్త వెలుగును నింపే క్యారెక్టర్లో మా హీరో శర్వానంద్ కనిపిస్తారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అద్భుతమైన అనుబంధం చుట్టూ రాసుకున్న కథ ఇది. ఈ సినిమాతో శర్వానంద్‌కి నేషనల్ అవార్డు రావాలి. అంత అద్భుతంగా చేశారు. ఇప్పటివరకు శర్వానంద్ బెస్ట్ చూశారు. ఈ సినిమాలో ఆయనలోని బీస్ట్ చూస్తారు. అలాగే అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. డింపుల్ కూడా ఈ సినిమాలో చాలా కొత్త క్యారెక్టర్ చేసింది. ఇందులో పర్శి గ్యాంగ్ మిమ్మల్ని భయపెడుతుంది. వాళ్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. రాధామోహన్ గారితో నా జర్నీ ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గానే ఉంటుంది. ‘భోగి’ కూడా అద్భుతమైన విజయం కాబోతోంది’ అని అన్నారు.
సంతృప్తినిచ్చిన ‘భోగి’
17 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్లు (0)