తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ‘భగవంతుడు’. కన్నడ నటుడు రిషి కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని రవి పనస ఫిలిం కార్పొరేషన్ (పనస మీడియా ఇం డియా ప్రైవేట్ లిమిటెడ్) బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రవి కుమార్ పనస నిర్మిస్తున్నారు. విద్యా శ్రీ పనస సహ నిర్మాత.
ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవు తున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబో తోంది. త్వరలో మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయ బోతున్నారు.
ఈ సినిమా షూటింగ్, ప్యాచ్ వర్క్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ రవి పనస హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మి స్తున్నారు. డైరెక్టర్ జి జి విహారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా తెరకెక్కిస్తున్నారు. హీరో తిరువీర్ కెరీర్ లో ఈ సినిమా ప్రెస్టీజియస్ గా ఉండబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై మూవీ లవర్స్ లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి అని మేకర్స్ తెలిపారు.
రిషి, వినయ్ వర్మ, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ అధిరే అభి, బలగం సంజయ్, హర్షిణి, రవీందర్ రెడ్డి, మైమ్ మధు, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా: రాజ్ తోట, సంగీతం: కె.పి., ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, ఎడిటర్: ప్రవీణ్ పూడి, లైన్ ప్రొడ్యూసర్: గౌతమ్ ఊడు గుల, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - జి. జి. విహారి.






కామెంట్లు (0)