Magazines

వినూత్న కథతో ‘రికార్డ్‌’

21 నిమిషాల క్రితం

'Record' with an innovative story
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న తన 14వ చిత్రానికి 'రికార్డ్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీర కోగటం రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు చిత్ర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

హీరో కిరణ్‌ అబ్బవరంపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, సుకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు డీవీవీ దానయ్య, దిల్ రాజు చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ, ‘సుకుమార్‌తో అసోసియేషన్‌, వంశీ నందిపాటితో 'క' తరువాత మళ్లీ అసోసియేషన్‌ అవ్వడం, అలాగే అశోక్‌ బండ్రెడ్డి కూడా ఈ సినిమాకు నిర్మాత కావడం.. మంచి సినిమా అందిస్తామనే నమ్మకం ఉంది. టైటిల్‌ రికార్డ్‌ తో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుంది. 18 సంవత్స రాలు మీడియాలో పనిచేసిన వీర ఈ సినిమాతో దర్శకుడు అవుతున్నాడు. ఈ కథను వీర ఎంతో అద్భుతంగా డెలీవరి చేస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమా అందరూ గర్వపడే సినిమా అవుతుంది' అని అన్నారు. ‘కిరణ్‌ అబ్బవరంతో చేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీలోని రికార్ట్‌లన్నీ బద్దలు కొట్టాలని కోరుకుంటు న్నాను. ఓ మంచి సినిమాను అందిస్తున్నాం’ అని నిర్మాత వంశీ నందిపాటి చెప్పారు.

నిర్మాత అశోక్‌ బండ్రెడ్డి మాట్లాడుతూ,‘ఈ సినిమా కథను అంగీకరించిన కిరణ్‌ అబ్బవరంకు నా ధన్యవాదాలు. దర్శకుడు వీర ఓ మంచి కథతో కొత్త సినిమా తీస్తున్నాడు’ అని తెలిపారు.

‘కర్నూలు కొండారెడ్డి బూరుజు సాక్షిగా ఓ మంచి సినిమా ఇస్తున్నానని నమ్మకంగా చెబుతున్నాను' అని దర్శకుడు వీర కోగటం అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్