Magazines

ఆంధ్ర - తెలంగాణకు భిన్నంగా అమెరికాలో తెలుగువారి దీపావళి

23 నిమిషాల క్రితం

Diwali of Telugus in America
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

- ఏడాదికో కుటుంబం ఇంట్లో ఉమ్మడి సంబరాలు

- తేలికపాటి కాంతి, తక్కువ శబ్దం చేసే క్రాకర్స్‌కే ప్రాధాన్యం

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగే దీపావళి వేడుకలకు భిన్నంగా అమెరికాలోని తెలుగువారు పండుగను కుటుంబ సమేతంగా, పరస్పర కలయికకు ప్రాధాన్యమిస్తూ జరుపుకుంటున్నారు. సమీప ప్రాంతాల్లో నివసించే ఆంధ్ర, తెలంగాణ కుటుంబాలు ప్రతి ఏడాది ఒకరి ఇంట్లో సమావేశమై దీపావళి సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. పిండి వంటలు తయారు చేసుకోవడం, నూతన వస్త్రాలు ధరించడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడపడం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. స్థానిక నిబంధనలకు అనుగుణంగా తేలికపాటి శబ్దంతో, కాంతిని వెదజల్లే కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వంటి క్రాకర్స్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మాత్రం దీపావళి సందర్భంగా భారీ శబ్దాలు చేసే బాంబులు, ఇతర బాణసంచాను విస్తృతంగా కాల్చడం సాధారణంగా కనిపిస్తుంది. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో స్థానిక నిబంధనల కారణంగా శబ్ద కాలుష్యాన్ని తగ్గించే విధంగా తేలికపాటి క్రాకర్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన తెలుగు కుటుంబాలు గతంతో పోలిస్తే ఈ ఏడాది దీపావళిని పాక్షికంగా నిర్వహించారు. ఈ ఏడాది నెల్లూరు జిల్లా వాసి సుబ్బు నివాసంలో అనిల్, ధీరజ్, మురళి, నిశాంత్, వెంకట్, రామచక్రధర్ కుటుంబాలు కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.

కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వెలిగిస్తూ కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ఆనందంగా దీపావళి వేడుకలను నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్