మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం.. 50 మందికి ఉచితంగా రక్త పరీక్షలు
నవతెలంగాణ-ఆలేరు రూరల్
మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మహిళా సంఘాల (SHG) కార్యక్రమంలో భాగంగా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో గురువారం ఉచిత బ్లడ్ గ్రూపింగ్ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 50 మంది మహిళలకు ఉచితంగా రక్త వర్గ నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శారాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ హరీష్ పర్యవేక్షణలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు రక్త వర్గం తెలుసుకోవడం, అత్యవసర సమయాల్లో రక్తదానం అవసరం, ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండటం వంటి అంశాల ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ సత్య, ఏఎన్ఎం లక్ష్మి, వీబీకె శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)