Magazines

బొగ్గు గని పెన్షనర్లకు ఉచిత 'డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్' మెగా క్యాంప్

51 నిమిషాల క్రితం

avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సింగరేణి బొగ్గు గని రిటైర్డ్ ఉద్యోగుల సౌకర్యార్థం నవంబర్ 5, 6 తేదీల్లో రుద్రంపూర్ కాలనీలోని సీఈఆర్ క్లబ్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్) నమోదు మెగా క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సింగరేణి సత్తుపల్లి ఏరియా జీఎం కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదలైంది. కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్ఓ)  కొత్తగూడెం రీజినల్ కమిషనర్లు వంశీధర్ కుసుంబ, ఎం. కనకమ్మల పర్యవేక్షణలో ఈ ప్రత్యేక శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  ఈ క్యాంప్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. 


​పెన్షన్ చెల్లింపులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు, పెన్షనర్లు తమ బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించుకోవాలన్నారు.  ఈ శిబిరానికి వచ్చే పెన్షనర్లు తప్పనిసరిగా క్రింది పత్రాలు ఆధార్ కార్డ్ (లింక్ అయిన మొబైల్ నంబర్‌తో) ​పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) నంబర్ ​సీఎంపీఎఫ్ (CMPF) ఖాతా లేదా క్లెయిమ్ నంబర్ ​పెన్షన్ జమ అయ్యే బ్యాంక్ పాస్‌బుక్ బ్యాంకులు,  సీఎంపీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా పెన్షనర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ​మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నోడల్ అధికారుల ఫోన్ నంబర్లు వి. సులోచన (ఈఓ)- 9885868777, ఎస్. శ్రీనివాసరావు (ఈఓ) - 8187093225 ఈమెయిల్ అడ్రస్  [email protected] తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్