Magazines

గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు దోహదం

17 నిమిషాల క్రితం

aleru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

-సర్పంచ్ సిరిమర్తి రేణుక

నవతెలంగాణ – ఆలేరు రూరల్ : గ్రామీణుల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని మందనపల్లి గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక అన్నారు. సోమవారం ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉపసర్పంచ్,పాలకవర్గం, రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు గ్యాదపాక మల్లేష్, కొల్లూరు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ప్రజారోగ్య పరిరక్షణకు గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మశ్రీ శశిరేఖ సుదర్శన్, వార్డు సభ్యులు కడకంచి శ్రీలత కృష్ణ,తమ్ముడి అంజయ్య రాము, కడకంచి సిద్ధిరాజు,ఉట్కూరి అంజయ్య,కుర్రి సాయికుమార్,గుండు బాలమణి,పంచాయతీ కార్యదర్శి సర్వర్ నాయక్, ప్రభుత్వ గ్రామస్థాయి ఉద్యోగులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్