తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ - మల్హర్ రావు
అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు బీమా నమోదు రసీదులను పంపిణీ చేశారు. రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లో 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. సదరు వ్యక్తి సాధారణ మరణం, ప్రమాదం ఏ కారణంతో మరణించినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథక లక్ష్యమన్నారు.ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్ల రవిందర్, బండారి విష్ణువర్ధన్ రెడ్డి, రాహుల్, కిషన్ నాయక్, కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.





కామెంట్లు (0)