Magazines

పట్టభద్రుల ఓటర్లు 2,090 మంది

15 నిమిషాల క్రితం

Graduate voters
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

- పురుషులు 1,193.. మహిళలు 897

- డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల

నవతెలంగాణ - అశ్వారావుపేట

ఖమ్మం - వరంగల్ - నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అశ్వారావుపేట మండల పట్టభద్రుల ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాను నియోజకవర్గ ఎన్నికల సహాయ అధికారి, తహశీల్దార్ దాసరి కిశోర్ బుధవారం విడుదల చేశారు. మండలంలో మొత్తం నాలుగు పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,090 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నట్లు జాబితాలో వెల్లడించారు. వీరిలో ,193 మంది పురుషులు, 897 మంది మహిళలు ఉన్నారు.


పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. 415వ పోలింగ్ కేంద్రం పరిధిలో 221 మంది పురుషులు, 169 మంది మహిళలు కలిపి 390 మంది ఓటర్లు ఉన్నారు. 416వ కేంద్రంలో 580 మంది పురుషులు, 464 మంది మహిళలు కలిపి 1,044 మంది, 417వ కేంద్రంలో 187 మంది పురుషులు, 138 మంది మహిళలు కలిపి 325 మంది, 418వ కేంద్రంలో 205 మంది పురుషులు, 126 మంది మహిళలు కలిపి 331 మంది ఓటర్లు ఉన్నారు.


డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే సంబంధిత ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్‌ఓ), సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులకు (ఏఈఆర్‌ఓ) తెలియజేయవచ్చని అధికారులు సూచించారు. పట్టభద్రుల ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించిన గడువులోగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్