- బీసీ బిడ్డను ఆదరించాలి
- ఆర్. కృష్ణయ్యతో శ్రీరాముల సారంగపాణి
నవతెలంగాణ-సత్తుపల్లి
రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందని బీసీ సంఘం అగ్రనేత, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు
ఎల్ఐసీ రిటైర్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరాముల సారంగపాణి (సత్తుపల్లి) తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంపీ కృష్ణయ్యను ఆయన నివాసంలో సారంగపాణి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సరళి, బీసీల రాజకీయ అవకాశాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బీసీ వర్గాలకు తగిన న్యాయం జరగడం లేదనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది.
బీసీ సమాజానికి మద్దతుగా నిలుస్తూ, తనను ఈ ఎన్నికల్లో ఆదరించి గెలిపించాలని సారంగపాణి ఆర్. కృష్ణయ్యను అభ్యర్థించారు. అందరితో ఆప్యాయంగా మెలిగే సారంగపాణి గెలిస్తే చట్టసభల్లో బీసీల గొంతుకను బలంగా వినిపిస్తారని ఆర్. కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ వర్గాలన్నీ ఐక్యంగా నిలిచి సారంగపాణికి పూర్తి మద్దతు ప్రకటించి గెలిపించాలని ఈ సందర్భంగా కృష్ణయ్య బీసీలను కోరినట్లు సారంగపాణి తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి, బీసీ హక్కుల సాధనకు నిరంతరం శ్రమిస్తానని సారంగపాణి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అర్హత కలిగిన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవడం బాధ్యతగా భావించాలని సారంగపాణి విజ్ఞప్తి చేశారు. నవంబర్ 6వ తేదీలోగా అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ ఆన్‌లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై పోరాడేందుకు చట్టసభల్లో సరైన భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ భేటీతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో సారంగపాణి పోటీ చేయడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.






కామెంట్‌లు (0)