నవతెలంగాణ–నాచారం
హెచ్‌ఎంటీ నగర్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో రూ.2.07 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. డివిజన్‌లోని వివిధ కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, వర్షపు నీటి పైప్‌లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందిరానగర్ లెఫ్ట్‌లోని 2, 3, 4, 5, 7వ వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.49.80 లక్షలు, జాన్సన్ గ్రామర్ స్కూల్ వద్ద డ్రైనేజీ, వర్షపు నీటి పైప్‌లైన్ నిర్మాణానికి రూ.70.20 లక్షలు కేటాయించారు.
సరస్వతీ నగర్ మెయిన్ రోడ్డు నుంచి హెచ్‌ఎంటీ నగర్ 5వ వీధి వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.39.40 లక్షలు, బాపూజీ నగర్‌లోని 1, 2వ రోడ్లలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.49.80 లక్షలతో పనులు చేపట్టనున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆయా కాలనీల్లో రహదారుల సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు తగ్గి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత సమయంలో పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకుడు సాయిజెన్ శేఖర్, సంబంధిత అధికారులు, స్థానిక బీఆర్‌ఎస్ కార్యకర్తలు, కాలనీల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)