Magazines

హుజూరాబాద్-గిద్దె ముత్తారం బస్సు సర్వీస్ ప్రారంభం

2 గంటల క్రితం

Huzurabad-Gidde Muttaram
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -టేకుమట్ల 

గిద్దె ముత్తారం సర్పంచ్ చంద్రకళ రవీందర్, రాఘవపూర్ సర్పంచ్ అంబాల కిరణ్ కుమార్ ల విజ్ఞప్తి మేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చోర్వతో హుజూరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ స్పందించి హుజరాబాద్ టు గిద్దె ముత్తారం వరకు ఆర్టీసీ బస్సు నడిపేలా అనుమతి ఇవ్వడంతో ఆదివారం బస్సు సర్వీసును జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దొంతుల శ్రీనివాస్,గిద్దె ముత్తారం సర్పంచ్ చంద్రకళ రవీందర్, రాఘవపూర్  సర్పంచ్ అంబాల కిరణ్, కుమార్, మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు కుర్రే మల్లయ్య  యాదవ్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించి బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు, గిద్దముత్తారం సర్పంచ్  చంద్రకళ రవీందర్, రాఘవపూర్ సర్పంచ్ అంబాలకిరణ్ కుమార్ లకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్