మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన జైపాల్ యాదవ్

20 నిమిషాల క్రితం

Jaipal Yadav
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్

మిడ్జిల్ మండలం వాడియాల గ్రామ మాజీ సర్పంచ్ సుధాకర్ కుటుంబాన్ని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. సుధాకర్ సతీమణి రాజమ్మ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారన్న విషయం తెలుసుకున్న జైపాల్ యాదవ్, నేరుగా వారి నివాసానికి వెళ్లి రాజమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పారు.


ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న స్థానిక నాయకులు, గతంలో తన ఎన్నికల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పేరుపేరునా పలకరించారు. వారందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, పార్టీ బలోపేతంపై కాసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో అంజయ్య, బొర్రా రాజయ్య, యాదయ్య, కృంగి మధుమోహన్, నామిని శ్రీనివాసులు, ఆనెగండ్ల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్