నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులోని అధికార టీవీకే (TVK) పార్టీకి చెందిన కళ్లకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు సి. అరుళ్ విగ్నేష్‌ను పోలీసులు శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఒక మహిళా ఐఏఎస్ అధికారికి పంపిన సందేశాలకు సంబంధించి, ఆమె చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే అరుళ్ విగ్నేష్‌పై నవంబర్ 23న అధికారికంగా ఫిర్యాదు నమోదు కాగా, నాలుగు రోజుల తర్వాత ఆయనను అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు, తనపై వచ్చిన ఆరోపణలను విగ్నేష్ ఖండించారు. ఇవి నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమని ఆయన పేర్కొన్నారు.
TVK ఎమ్మెల్యే అరుళ్ విగ్నేష్ అరెస్టు
18 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)