మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్
నవతెలంగాణ – పరకాల
తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ప్రాధాన్యతనిస్తోందన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక భరోసా అందించనున్నట్లు పేర్కొన్నారు.
కావున అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీమా పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)