వరుసగా రెండో ఏడాది మండలంలోనే అగ్రస్థానం
జిల్లాస్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక
నవతెలంగాణ-చండూరు
ప్రతిభకు పట్టుదల తోడైతే విజయాలు వాటంతట అవే వరిస్తాయని సన్‌షైన్ హైస్కూల్ విద్యార్థులు నిరూపించారు. ఇటీవల నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించి వరుసగా రెండో ఏడాది తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. పాఠశాలకు చెందిన శ్రీనిధి, సిరి, శాశ్వత్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధించడం విశేషం.
ఈ విజయాన్ని పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కరస్పాండెంట్ కోడి వెంకన్న విద్యార్థులను శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు రవికాంత్, వినయ్, ప్రవీణ్, ఆదిత్య, దేవేందర్, నాగమణిలను అభినందించారు.
ఈ సందర్భంగా కోడి వెంకన్న మాట్లాడుతూ వరుసగా రెండో ఏడాది చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించడం విద్యార్థుల కృషికి, ఉపాధ్యాయుల అంకితభావానికి నిదర్శనమన్నారు. జిల్లాస్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.






కామెంట్లు (0)