గ్రామాల్లో ప్రారంభమైన ఇందిరమ్మ జీవిత బీమా

25 నిమిషాల క్రితం

Indiramma Life Insurance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల పరిధిలోని గోజేగావ్, మేనూర్, శేఖపూర్, రుసేగావ్ గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్ష‍ులు ధరాస్‌ సాయిలు మాట్లాడుతూ.. ప్రజా సంక్ష‍ేమమే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. అదేవిధంగా గ్రామాల సర్పంచులు, మండలాధికారులు మాట్లాడుతూ.. రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం అర్హులని పేర్కొన్నారు. త్వరితగతిన ఇందిరమ్మ జీవిత బీమా నమోదు చేసుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ శివాజీ రాథోడ్, ఎంపీడీవో పి సాయిలు, ఎంపీ ఓ సత్యనారాయణ రెడ్డి, తాసిల్దార్ ఎండి ముజీబ్, మండల వ్యవసాయ అధికారి రాజు, గోజేగావ్ గ్రామ సర్పంచ్ భారత్ రాథోడ్, ఆ గ్రామ ఉపసర్పంచ్ రేఖభాయి బసవంతరావు, ఆ గ్రామ కార్యదర్శి హరీష్, మేనూరు గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్, ఉప సర్పంచ్ మల్కయ్య, గ్రామ కార్యదర్శి హరీష్ కుమార్, ఆ గ్రామ పెద్దలు జుబ్రే సురేష్, శాఖాపూర్ గ్రామ సర్పంచ్ తుకారం, ఉపసర్పంచ్ ఫక్రూ పటేల్, గ్రామ కార్యదర్శి సంగీత, రూశేగావ్ గ్రామ సర్పంచ్ సుమన్ బాయి, ఉపసర్పంచ్ మహేష్, గ్రామ కార్యదర్శి కృష్ణవేణి, ఆయా గ్రామాల పంచాయతీ పాలకవర్గం సభ్యులు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు ఆయా గ్రామాల పెద్దలు గ్రామస్తులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్