- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిళల కోలాటాలు, నృత్యాలు
నవతెలంగాణ-సత్తుపల్లి
విజయదశమి పండుగను పురస్కరించుకుని సత్తుపల్లిలోని ప్రముఖ వస్త్ర దుకాణమైన జీవీ మాల్ లో బతుకమ్మ వేడుకలు మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగాయి. మాల్ యాజమాన్యం ఆదేశాల మేరకు సిబ్బంది అందరూ కలిసి ఈ సంబురాలను ఎంతో వైభవంగా, అట్టహాసంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డీజే పాటలు, బతుకమ్మ జానపద గేయాల నడుమ మహిళా సిబ్బంది కోలాటాలు ఆడుతూ, నృత్యాలు చేస్తూ అలరించారు. ప్రధాన రహదారిపై ఉన్న మాల్ ఎదుట నిర్వహించిన ఈ ఆటపాటలను చూసేందుకు ప్రజలు, వాహనదారులు ఆగి మరీ ఆసక్తిగా తిలకించారు. సత్తుపల్లి పట్టణంలో ఎన్నో వస్త్ర దుకాణాలు ఉన్నప్పటికీ, ప్రతీ ఏటా జీవీ మాల్ లో బతుకమ్మ సంబురాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. సాంప్రదాయ పద్ధతిలో పూలతో బతుకమ్మలను పేర్చి, పూజలు నిర్వహించి మహిళా సిబ్బంది పండుగ ఉత్సాహాన్ని నింపారు. పూల పండుగ విశిష్టతను చాటిచెబుతూ సిబ్బంది అంతా కలిసికట్టుగా నిర్వహించిన ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది.
పండుగ వేళ మాల్ సిబ్బంది చూపిన ఉత్సాహం, కళాత్మక ప్రదర్శనలు సత్తుపల్లి పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వ్యాపారంతో పాటు సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న యాజమాన్యాన్ని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీ మాల్ సత్తుపల్లి బ్రాంచ్ ప్రధాన బాధ్యుడు ఉదయ్ భాస్కర్, వివిధ విభాగాల సిబ్బంది రాజేష్, బాబీ, రజిని, మౌనిక, అనిత శ్రీలాస్య, దివ్య, మాధవి, కృష్ణకుమారి పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)