Magazines

మంత్రి తుమ్మలను కలిసిన భద్రాచలం మైనార్టీ నాయకులు

1 గంట క్రితం

met Minister Tummala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ-సత్తుపల్లి 

భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా​దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని భద్రాచలం పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు, ఈద్గా కమిటీ సభ్యులు భద్రాచలం నియోజకవర్గ సీనియర్ నాయకుడు రసూల్ నాయకత్వంలలో కలిశారు. భద్రాచలం పట్టణంలోని ముస్లిం మైనార్టీల కోసం గతంలో ఏర్పాటు చేసిన షాదీఖానా, దర్గాలలో నెలకొన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మైనార్టీల సంక్షేమానికి, మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం పైన తెలిపిన సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి తుమ్మలకు వినతి పత్రం అందించారు.  వినతిపత్రం స్వీకరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వారితో మాట్లాడుతూ సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్