Magazines

24 ఏళ్లుగా దసరా ఉత్సవాలు.. 

2 గంటల క్రితం

Dussehra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

విజయదశమికి మహా అన్నదానం..

బండి పుల్లారావు దంపతులు చే నిర్వహణ 
నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం పంచాయతీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామంలో కొలువుదీరిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో 24 ఏళ్లుగా దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు బండి పుల్లారావు - చలమమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా పది రోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.


ఉత్సవాల ముగింపు సందర్భంగా పదో రోజు భక్తులకు అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ ఏడాది విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం, అక్టోబర్ 20న ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బండి పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడంతోపాటు అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన ఆహ్వానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్