Magazines

గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కేంద్రాన్ని ప్రారంభించాం

1 గంట క్రితం

Rehana Kamal Pasha
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం

- ఉచితంగా ఓటును ఎన్‌రోల్‌మెంట్ చేసుకోండి 

- మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మీ-సేవ కేంద్రం వద్ద  పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ తెలిపారు. ​టీపీసీసీ, డీసీసీ, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు ఈ ఆన్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవడానికి నవంబర్ 6వ తేదీ వరకు తుది గడువు ఉందన్నారు.


అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటును ఉచితంగా నమోదు చేసుకోవాలని కోరారు. ​డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువు పూర్తి చేసిన అర్హులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ​పట్టభద్రుల ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ విజ్ఞప్తి చేశారు. ​పట్టభద్రుల ప్రయోజనాల కోసం శ్రమించే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ​ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని రెహానా కమల్ కోరారు. స్థానిక పట్టభద్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ నమోదు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్