Magazines

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఆన్‌లైన్ ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు 

5 గంటల క్రితం

registration centers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

- 21 గ్రామపంచాయతీలు, 6 ఆన్‌లైన్ కేంద్రాలు

నవతెలంగాణ-సత్తుపల్లి 

విద్యా బలం, యువశక్తి ప్రజాస్వామ్యానికి ప్రధాన మూలస్తంభాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. పట్టభద్రుల సౌకర్యార్థం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల పరిధిలో ఓటరు నమోదు ఆన్‌లైన్ కేంద్రాలను గురువారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి  ప్రారంభించారు. ఏర్పాటుచేసిన 6 ఈ ఆన్‌లైన్ కేంద్రాలలో 21 గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న పట్టభద్రులు తమ ఓటును ఆన్‌లైన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. 


మండలంలో ఏర్పాటుచేసిన ఆన్‌లైన్ కేంద్రాలు ఇవే ​

ఆన్‌లైన్- 01 కేంద్రంలో రేజర్ల, కొత్తూరు ప్రాంతాల వారికి ప్రత్యేక కేంద్రం అందుబాటులో ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్-02 కేంద్రంలో సిద్ధారం, గౌరిగూడెం, సదాశివునిపాలెం గ్రామాల ప్రజలు ఈ కేంద్రంలో నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్-03 కేంద్రంలో గంగారం, రామగోవిందాపురం, పాకలగూడెం, రామానగరం, బేతుపల్లి, తాళ్లమడ గ్రామాలకు ఆన్‌లైన్ నమోదు సదుపాయం కల్పించారు. ఆన్‌లైన్-04 కేంద్రంలో కిష్టారం, యాతాలకుంట, చెరుకుపల్లి, రేగళ్లపాడు గ్రామాల పట్టభద్రులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్-05 కేంద్రంలో కిష్టాపురం, తుంబూరు, నారాయణపురం గ్రామాల వారికి ఈ కేంద్రం కేటాయించబడింది.


ఆన్‌లైన్-06 కేంద్రంలో

​రుద్రాక్షపల్లి, బుగ్గపాడు, కాకర్లపల్లి ప్రాంతాల పట్టభద్రుల కోసం ఈ కేంద్రం పనిచేస్తుంది. అర్హులైన పట్టభద్రులందరూ తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి  కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్