నవతెలంగాణ - అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజును అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా పోస్టింగ్ పొందిన సాయి కిషోర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రోటోకాల్ ప్రకారం ఎస్పీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అశ్వారావుపేట మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు ఎస్‌హెచ్‌ఓ ప్రతిస్పందిస్తూ..మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)