Magazines

సదాశివునిపాలెంలో భూ రీ-సర్వే పనులను పరిశీలించిన సబ్ కలెక్టర్

1 గంట క్రితం

Sadashivunipalem
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

- 1,163.16 ఎకరాల భూ విస్తీర్ణం భూ విస్తీర్ణం

- 236.20 ఎకరాల్లో  రీ-సర్వే పనులు పూర్తి 

- కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ 

నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి మండలంలోని సదాశివునిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే పనులను కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన సర్వే పనుల పురోగతిని సమీక్షించి, భూముల వివరాలను సంబంధిత సర్వే బృందాల ద్వారా పరిశీలన చేశారు. సదాశివునిపాలెం గ్రామానికి సంబంధించి మొత్తం 1,163.16 ఎకరాల భూ విస్తీర్ణం ఉండగా, అందులో 236.20 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించిన రీ-సర్వే పనులు పూర్తయినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు. సర్వే ప్రక్రియలో భూముల హద్దులు, విస్తీర్ణాలు, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయిలో సబ్ కలెక్టర్ క్షుణ్ణంగా సరిచూశారు.


పారదర్శకంగా, కచ్చితత్వంతో పనులు నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. అనంతరం గ్రామంలో భూ రీ-సర్వే గ్రామసభను ఏర్పాటు చేసిరైతులతో మాట్లాడారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే రీ-సర్వే ప్రధాన లక్ష్యమని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో రైతులు, గ్రామస్థులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కొలతలు, సర్వేపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రీ-సర్వేలో ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వే బృందం, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్