నవతెలంగాణ-ఆలేరు టౌన్
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావును ఆలేరు బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నాయకులందరూ సంయుక్తంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ..బీఆర్ఎస్ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సెక్రెటరీ జనరల్ కుండే సంపత్, మాజీ కౌన్సిలర్ రాయపురం నరసింహులు, యూత్ అధ్యక్షులు పల్లె మహేష్ గౌడ్, కూల శ్రీశైలం, అంకిరెడ్డి కృష్ణ, రాయపురం శేఖర్, కూల మధు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)