శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్ మీద వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న నూతన చిత్రం ‘మిస్టర్ దెయ్యం’. విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి సంజన అన్నే దర్శకుడు. ఈ చిత్ర ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేయగా.. వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు సంజన అన్నే మాట్లాడుతూ, ‘ఆద్యంతం అలరించే కథ ఇది’ అని అన్నారు. ‘ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రం. . ఇందులో థ్రిల్ చేసే హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి’ అని విజయ్ శంకర్ చెప్పారు.






కామెంట్లు (0)