Magazines

అదృశ్యం అయిన బాలిక

59 నిమిషాల క్రితం

The missing girl
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

- ఇంటర్‌ విద్యార్థిని అదృశ్యం

- కొత్తగూడెం క్రీడా శిబిరానికి వెళ్లి తిరిగి రాని బాలిక

- కేసు నమోదు 

- అదనపు ఎస్సై దేవ్ సింగ్ 

నవతెలంగాణ - అశ్వారావుపేట

మండలంలోని చెన్నాపురం కు చెందిన ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని మడకం అనూహ్య (16) అదృశ్యమైనట్లు అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాలిక తల్లి మడకం శాంతి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు అదనపు ఎస్సై దేవ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. 

చెన్నాపురం గ్రామానికి చెందిన మడకం శాంతి భర్త దివంగత సింగరాజు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఆమె కుమార్తె అనూహ్య భద్రాచలం టీజీఆర్‌జేసీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 12న ఉదయం ఇంటి నుంచి కొత్తగూడెం వెళ్లిన అనూహ్య, ఈ నెల 13 నుంచి 19 వరకు నిర్వహించిన క్రీడా శిబిరంలో పాల్గొనాల్సి ఉంది. అయితే శిబిరం ముగిసినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి విచారించారు. అనంతరం బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా బాలిక ఆచూకీ లభించలేదు.

దీంతో ఈ నెల 21 వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటలకు బాలిక తల్లి శాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు క్రైమ్‌ నంబర్‌ 256/2026 కింద బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 137(2) ప్రకారం కేసు నమోదు చేశారు. అదృశ్యమైన బాలిక ఎత్తు సుమారు ఐదు అడుగులు, తెల్లని ఛాయతో ఉందని, అదృశ్యం అయిన సమయంలో నలుపు రంగు జీన్స్‌ ప్యాంట్‌, ఆరెంజ్‌, ఎరుపు రంగుల టాప్‌ ధరించి ఉందని పోలీసులు తెలిపారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్