అనారోగ్య బాదిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందజేత

1 గంట క్రితం

LOC
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు 

మండలంలోని రత్తి రామ్ తండా గ్రామ నీక్కి చెందిన హారిక అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్యానికై ఆమె తండ్రి గుగులోతు వెంకన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కలిసి విన్నవించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు నాయిని సత్యపాల్ రెడ్డి ద్వారా తక్ష‍ణమే రూ.1 లక్ష‍ ఎల్‌ఓసీని బాదిత కుటుంబానికి అందించారు. అనంతరం గగులోతు వెంకన్న మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నా కూతురు వైద్యానికి ఖర్చులకు ఆర్థిక సాయం అందించారనీ, ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్