Magazines

ఢిల్లీ ముట్టడిని జయప్రదం చేయండి

24 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

- కార్మిక హక్కుల పరిరక్షణకై కార్మిక వర్గం ఢిల్లీకి కదలి రండి

- పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గం..లేబర్ కోడ్లు రద్దు చేయాలి

- కనీస వేతనం అమలు చేయకుండా శ్రమ దోపిడీ ఎంతకాలం

- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

 నవతెలంగాణ-సంగారెడ్డి : మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై డిసెంబర్ 1-3 తేదీల్లో పార్లమెంట్ ముట్టడిలో కార్మికవర్గం పాల్గొనాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం చలో ఢిల్లీకి కార్మికులంతా ఐక్యంగా కదలాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డిలో జరిగిన సీఐటీయూ జిల్లా విస్తృత సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ  కార్మికులు దశాబ్దాలపాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ వాటి స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కోడ్స్ అమలుతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా శాశ్వత ఉద్యోగాల్లో సైతం కాంట్రాక్ట్, నిర్ణీత కాల ఉద్యోగాలుగా మార్చుతున్నారని విమర్శించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను అప్పగించే విధానాలను విడాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల గ్రామీణ కార్మికులకు ఉపాధి అవకా శాలు తగాయన్నారు.  పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరల రీత్యా కనీస వేతనాన్ని 42 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో పని చేస్తూ కార్మికులు తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు.కార్మికుల శ్రమను కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు దోచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసే చర్యలు మానుకోవాలని కోరుతూ జరుగుతున్న చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, సాయిలు, నాయకులు రాజయ్య, పాండురంగారెడ్డి, మహిపాల్, ప్రవీణ్, రమేష్, మంగ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్