నవతెలంగాణ-మల్హర్ రావు
ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన భారీ నిరసన ర్యాలీకి మండల నాయకులు బయలు దేరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకొని ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం, రాజ్యాంగ విలువలను కాపాడటం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల గొంతుకగా కాంగ్రెస్ శ్రేణులు తమ గళాన్ని ఢిల్లీలో వినిపిస్తున్నామని పేర్కొన్నారు.






కామెంట్లు (0)